January-8 | Current affairs in telugu

0

Daily Current Affairs | January current affairs in Telugu

జోరన్ మిలనోవిక్

క్రొయేషియా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో క్రొయేషియా మాజీ ప్రధాని సోషల్ డెమోక్రటిక్ పార్టీ నేత జోరన్ మిలనోవిక్ విజయం సాధించారు.

మగేశ్ చంద్రన్

ఇంగ్లాండ్ లోని  హేస్టింగ్స్ వేదికగా ’95వ హేస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ’లో తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ మగేశ్ చంద్రన్ టైటిల్ గెలుచుకున్నాడు.

యాంత్రిక్ కి యాత్ర

కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణరావు కిర్లోస్కర్ జీవిత కథ కి ‘యాంత్రిక్ కి యాత్ర ‘ హిందీ వర్షన్ ను కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

చిత్రదుర్గ

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్ళెకెరె లో గగన్ యాన్ ప్రాజెక్టు కోసం అదనపు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జనవరి 6న తెలిపింది.

ఉక్కు కర్మాగారం

విశాఖపట్నంలో ఇస్పాత్ నిగం లిమిటెడ్ , కొరియాకు చెందిన పోస్కో సంయుక్తంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే ప్రతిపాదన చేసాయి. 20 వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు.

వృద్ధి రేటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి  5 %  చేరవచ్చని జాతీయ గణాంక కార్యాలయం తన తొలి ముందస్తు అంచనాలు వెల్లడించింది.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here