Current Affairs in Telugu

Share

january-7 | Telugu Current Affairs | Daily current affairs pdf

యురేనియం నిల్వలను పెంచుకుంటాం : ఇరాన్

ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని జనవరి 6న ఇరాన్ ప్రకటించింది.

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విసృ్తతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో జనవరి 6న కీలక సూచన చేసింది.

దేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్ ఇరాన్ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

 

 

గగన్‌యాన్

చిత్రదుర్గ జిల్లాలో గగన్‌యాన్ శిక్షణ కేంద్రం

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెలో గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం అదనపు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జనవరి 6న తెలిపింది.

🇮🇳‘హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్’గా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్‌యాన్‌కు సంబంధించిన కార్యక్రమాలతోపాటు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గగన్‌యాన్ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు.

🇮🇳భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే సొంత సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుడిని అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

గగన్‌యాన్- ముఖ్యాంశాలు

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది.

ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం రష్యా, ఫ్రాన్స్ లతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది.

సంస్కృత పదం వ్యోమ్(అంటే అంతరిక్షం అని అర్థం) ఆధారంగా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ‘వ్యోమ్‌నాట్స్’ అని వ్యవహరిస్తారు.

జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా గగన్‌యాన్ ప్రయోగం చేపట్టనున్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మానవుడిని విజయవంతంగా పంపిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.▪

ఈ ప్రాజెక్టు కోసం రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది.

ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం

🏵బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది.

🇮🇳భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర జనవరి *💫6న ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మహాపాత్ర ప్రసంగిస్తూ… రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.

 

mobiForge Web share API Demo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *