January-6 | Current affairs in Telugu | Daily pdf Telugu current affairs

తెలంగాణ విద్యార్థిని అంజలికి ఇన్ఫోసిస్ అవార్డు

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు’ లభించింది.

🇮🇳ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వార్షిక సమావేశం సందర్భంగా జనవరి 4న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అంజలికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డును అందజేస్తారు.

 

అంతర్జాతీయ అవార్డు అందుకున్న జెన్నిఫర్ అల్ఫోన్స్

ఆదిలాబాద్ జిల్లాలోని కోలాం గిరిజనులపై వీ6 ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాదీ జెన్నిఫర్ అల్ఫోన్స్ డైరెక్షన్​ చేసిన ‘కోలాం’ డాక్యుమెంటరీకి వింధ్య ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ట్రైబల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఈ అవార్డును సోమవారం అందుకున్నారు విన్నర్ జెన్నిఫర్.

ఎంబీఏ చదివిన జెన్నిఫర్ ఎఫ్.టి.ఐ.ఐ.లో ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్స్ చేశారు. ఆమె తీసిన తొలి షార్ట్ ఫిల్మ్ ‘కచరా’కు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ చైల్డ్ యాక్టర్ కేటగిరీల్లో మూడు బంగారు నంది అవార్డులు దక్కాయి. ఏడేళ్లుగా ఫిల్మ్, డాక్యుమెంటరీ డైరెక్టర్, రైటర్ గా ఆమె అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. గతంలో నాగోబా జాతరపైనా ఆమె తీసిన డాక్యుమెంటరీకి పలు అవార్డులు వచ్చాయి.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు జనవరి 4న ఇర్ఫాన్ ప్రకటించాడు.

మేటి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న 35 ఏళ్ల పఠాన్ 2003లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ టెస్టులో అరంగేట్రం చేశాడు. 2012లో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్… 2019 ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీలో జమ్మూకశ్మీర్ తరఫున చివరిసారిగా దేశవాళీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ గణాంకాలు
వివరాలు టెస్టులు వన్డేలు టి20లు

ఆడిన మ్యాచ్‌లు 29 120 24

చేసిన పరుగులు 1105 1544 172

బ్యాటింగ్ సగటు 31.57 23.39 24.57

బౌలింగ్ ఎకానమీ 3.28 5.26 8.02

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ, రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామాంజనేయులు ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్నారు. కాగా, ఇప్పటివరకు ఏసీబీ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఇరాన్, అమెరికాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు.

ఇరాన్‌లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ జనవరి 4న ట్రంప్ ట్వీట్ చేశారు. చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది.

 

గడిచిన పదేళ్లకి విన్నర్‌గా నిలిచిన పదం ప్రకటన

2010 సంవత్సరం నుంచి 2019 వరకు గడిచిన దశాబ్ధ కాలానికి ఓ పదాన్ని విన్నర్‌గా తేల్చారు ఇంగ్లిష్ భాషా శాస్త్రవేత్తలు. వర్డ్ ఆఫ్ ది డికేడ్‌గా ఒక సర్వనామాన్ని ఎంపిక చేశారు. అది “they” (దే). అమెరికాకు చెందిన లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ సొసైటీ అయిన అమెరికన్ డైఎలక్ట్ సొసైటీ ఈ పదాన్ని ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితమే అమెరికన్ డిక్షనరీ మెరియం వెబ్‌స్టర్ కూడా ఇదే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది.

పోటీ పడిన పదాలు

వర్డ్ ఆఫ్ ద డికేడ్‌గా నిలిచిన “they”కి పోటీ ఇచ్చిన పదాల్లో మెమ్ (meme), క్లైమేట్ (climate) ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో ఈ మూడు పదాలకు టాప్-3గా ఓట్లు వచ్చాయని తెలిపింది అమెరికన్ డైఎలక్ట్ సొసైటీ. BlackLivesMatter, MeToo, emoji, opioid crisis, woke పదాలకు కూడా వర్డ్ ఆ ద డికేడ్ పోటీలో నిలిచినట్లు చెప్పింది.

లింగ సమానత్వ ప్రాధాన్యం చెప్పేలా

ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు, వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌లో వాడే సర్వనామం ఇది. ఆడ అయితే ఒక్కరిని షీ (she), మగ అయితే హీ (he) అంటారు. కానీ ఆ లింగ బేధాన్ని కచ్చితంగా చెప్పలేని సందర్భంలో ఒక్కరికి కూడా ఇంగ్లిష్‌లో దే అనే పదాన్ని వాడుతున్నారు. గడిచిన దశాబ్ధంలో “they” పదానికి చాలా ప్రాధాన్యం పెరిగిందని లింగ్విస్టిక్స్ అభిప్రాయపడుతున్నట్లు అమెరికన్ డైఎలక్ట్ సొసైటీ చీఫ్ బెన్ జిమ్మర్ అన్నారు. లింగ సమానత్వం ప్రస్తుత సమాజంలో ఎంతటి కీలకంగా మారిందన్నది ఈ పదం ఎంపికలోనే అర్థం అవుతోందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here